మొబైల్ మన జీవితంలో ఒక నిత్యవసర వస్తువుగా మరిపోయిందని చెప్పడం తప్పు ఏం కాదు. ఎందుకంటే మన జీవితంలో ఫోన్ చాలా ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. మరి అలాంటి మొబైల్ ఫోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
* 1983వ సంవత్సరంలో అమెరికా దేశంలో మొదట సారిగా అమ్మబడిన మొబైల్ ఫోన్ ధర 4 వేల డాలర్లు.
* నోకియా 1100 మనలో చాలామంది వాడిన తొలి ఫోన్ అదే. ప్రపంచంలో ఏకువగా అమ్ముడుపోయిన ఫోన్ కూడా ఇదే. దాదాపు 25 కోట్ల మంది ఈ మోడల్ ని వినియోగించారు..
* మనం వాడుతన్న మొబైల్ ఫోన్లలో 70% చైనా దేశంలో ఉత్పత్తి చేయబడతాయి.
* జపాన్ దేశంలో 90% మొబైల్ ఫోన్లు వాటర్ ఫ్రూఫ్ కలిగి ఉంటాయి.
* ప్రపంచంలోని మొదటి ఫోన్ కాల్ మార్టిన్ కూపర్ చేశాడు అది కూడా 1973వ సంవత్సరం లో.
* స్మార్ట్ ఫోన్ 1993వ సంవత్సరం లో ప్రపంచానికి పరిచయమైంది. ఐబిఎమ్ రూపొందించిన ఈ స్మార్ట్ మొబైల్ పేరు సైమన్. దీని ధర 899 డాలర్లు.
* ప్రస్తుతం, కంప్యూటర్ల కన్నా మొబైల్ ఫోన్ వాడే జనాభే ఎక్కువ అంట.
* సోనిమ్ XP3300 అనే ఫోన్ ప్రపంచంలో అత్యంత టఫ్ మొబైల్ గా చెబుతారు. దీన్ని 84 అడుగుల ఎత్తు నుంచి పడేసిన డ్యామేజ్ జరగదట.
* ఐఫోన్ బ్లాక్ డైమండ్ అనే పేరు గల ఫోన్ ప్రపంచంలోనే ఖరీదైన మొబైల్. దీని ధర అక్షరాల 15 మిలియన్ డాలర్లు.
* ఆపిల్ సంస్థ 2012 సంవత్సరంలో రోజుకి 3 లక్షల ఫోన్లు పైగా అమ్మిందట.
For More Interesting News And For Tollywood Updates Please Visit saycinema.blogspot.in