సులభంగా బరువు తగ్గాలా.. అయితే ఇవి తినండి చాలు


ఈ రోజుల్లో అధిక బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సాంకేతిక జీవితంలో చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు అందరు అధిక బరువుతో బాధపడుతున్న వారే. ప్రతి దానికి మన వాళ్ళు ఒక సులభమైన మార్గాన్ని కనిపెట్టేస్తున్నారు. ఉదాహరణకి ఇది వరకు రోజుల్లో టీ.వీ లో ఛానల్ మార్చాలంటే  టీ.వీ దగ్గరకు వెళ్లి ఛానెల్ మార్చాల్సి వచ్చేది , కానీ ఇప్పుడు కూర్చున్న చోట నుండి కదలకుండా రిమోట్ సహాయంతో యిట్టె  టీ.వీ లో ఛానల్  ను మార్చేస్తున్నాం. ఇది ఒక సింపుల్ ఉదాహరణ మాత్రమే.... ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి.

అధికంగా పెరిగిన బరువును సులభంగా తగ్గించుకోవాలనుకునే వారు ఈ క్రింది చెప్పినవి తిన్నట్లయితే అధిక బరువును కొద్ది రోజుల్లోనే తగ్గించుకోవచ్చు.  


గుడ్డు

గుడ్డు ఉత్తమ ఆహారాలలో ఒకటిగా ఉంది. దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగాను, కేలరీలు తక్కువగా ఉండి కడుపు నిండిన భావన కలుగుతుంది. ఒక అధ్యయనంలో అధిక బరువు ఉన్న 30 మందికి గుడ్డును అల్పాహారంగా ఇచ్చి 8 వారాల పాటు పరిశీలన చేయగా బరువు తగ్గటాన్ని గమనించారు. గుడ్డు మొత్తం తక్కువ కేలరీలు మరియు ఎక్కువ పోషకాలతో నిండి ఉంది.

పచ్చని ఆకుకూరలు

పచ్చని ఆకుకూరల్లో అనేక పోషకాలు మరియు  విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాసాల్మన్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉండుట వలన స్థూలకాయం మరియు జీవక్రియ వ్యాధులను తగ్గించటంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తాయిి. కొన్ని అధ్యయనాల్లో వీటిలో ఉండే కాల్షియం కొవ్వు కరిగించటానికి సహాయపడుతుందని తెలిసింది

సాల్మన్ చేప

సాల్మన్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉండుట వలన స్థూలకాయం మరియు జీవక్రియ వ్యాధులను తగ్గించటంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తాయి.

బంగాళదుంప

ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనిలో ఫైబర్ మరియు నిరోధక పిండి పదార్దం ఉండటం వలన బరువు తగ్గటానికి సహాయపడటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల చికిత్సలో సహాయపడుతుంది.

Share this

Related Posts

Previous
Next Post »