బెడ్ పై బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?


హాయిగా నిద్రపోవాలంటే పడుకునే ప్లేస్ కూడా అనుకూలం గా ఉండాలి. మంచిగా పాడుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుంది. రోజుకి  8 గంటలు నిద్రపోవడం ఉత్తమం. అంటే రోజుకి 8 గంటలు  బెడ్ పైనే గడుపుతాం.. ఆ బెడ్ పై ఉండే పరుపును క్లీన్ చేసుకోవడం అంటే కేవలం బెడ్ షీట్ సదురుకోవడం అనే అనే అనుకుంటాం.. అయితే  దానిపై కంటికి కనిపించని చాలా క్రిమి కీటకాలు దాగి ఉంటాయి. దుమ్మూ దూళి, పురుగులు, బ్యాక్టీరియా, చర్మానికి సంబంధించిన మృత కణాలు వంటి సూక్ష్మ క్రిములు చేరి మనకు అనారోగ్యం కలిగిస్తాయి. అవి మనకు కనిపించవు కాబట్టి  పెద్దగా వాటిని పట్టించుకోము పై పై శుభ్రం చేస్తూ బెడ్ షీట్లను తరచూ మారుస్తూ ఉంటాం. అయితే వాటిని అలాగే వదిలేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు  దారితీసే ప్రమాదం ఉంది. అందుకే పరుపును ఎలా శుభ్ర పరచాలో ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడా ను ఉపయోగించి ఇంట్లో పరుపులు శుభ్ర పరుచుకోవచ్చు. అయితే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావలసినవి:

  • 200 గ్రాముల బేకింగ్ సోడా

  • చిల్లుల గిన్నె


1. పైన తెలిపిన మొత్తం లో  బేకింగ్ సోడా తీసుకోవాలి. దానిని ఓ చిల్లుల గిన్నెలో పోసి బెడ్ పైన  పూర్తిగా చల్లాలి.

2. అరగంట పాటు బెడ్ పైన ఆ పొడి ని అలాగే ఉంచాలి. వ్యాక్యూమ్ తో లేదా హై స్పీడ్ టేబుల్ ఫ్యాన్ తో బెడ్ పై ఫోర్స్ గా గాలి తగిలేలా చేసి బేకింగ్ సోడా ని శుభ్రపరచాలి.


3. ఇలా చేయడం వల్ల బేకింగ్ సోడాతో సహా బ్యాక్టీరియా మొత్తం బెడ్ ని  వదిలి శుభ్రం అవుతుంది.
మీరు పరుపును క్లీన్ చేసి చాలా కాలం అయితే గనుక రెండో సారి బేకింగ్ సోడాను చల్లుకుని వాక్యూమ్ తో క్లీన్ చేయడం మంచిది.
పరుపు క్లీన్ కావడమే కాకుండా సువాసన వెదజల్లుతుంది.

Share this

Related Posts

Previous
Next Post »