వేసవి కాలంలో చర్మానికి చాల రకాలైన సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా చాలా మందికి ముఖం మొత్తం జిడ్డుగా మారిపోతుంటుంది. వేసవి కాలంలో కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాడైన చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం.....
1 . UV కిరణాల ప్రభావం
మీకు కుదిరినంత వరకు UV కిరణాలు మీ మీద ప్రభావం చూపకుండా చూసుకోండి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లో ఎండలో బయటకు రాకుండా ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా మధ్యాన్న సమయంలో బయటకి వెళ్లాల్సి వస్తే ముఖాన్ని ఏదైనా కాటన్ వస్త్రంతో కప్పుకోవడం మర్చిపోకండి. UV కిరణాలు చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇంకా చర్మ సంబంధిత కాన్సర్ కు కూడా ఇవి కారణం అవుతాయి.
2. సన్ స్క్రీన్ లోషన్ వాడండి
సూర్య కిరణాలలో ఉండే UV కిరణాలు చర్మానికి చాల హాని కారకాలు. వాటి నుండి మీ చర్మాన్నీ కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ వాడడం మంచిది.
3. మేకప్ తగ్గించండి
వీలైనంత మేరకు మేకప్ వేసుకోవడం తగ్గించండి. మేకప్ కోసం మనం వాడే క్రీముల వలన చర్మంలోని స్వేద రంద్రాలను ముసివేయడానికి అవకాశాలున్నాయి. వాటి వల్ల వివిధ రకాలైన ఇన్ఫెక్షన్స్ రావడమే కాకుండా, చర్మం కూడా తేమ ను కోల్పోతుంది.
4 .మొహాన్ని ఎక్కువగా కడగకండి
ముఖాన్ని వేసవిలో వీలైనంత ఎక్కువ సార్లు కడగడం వలన చర్మం లో దాగున్న మురికి బయటకు వస్తుంది. మన ముఖాన్ని కడిగిన ప్రతిసారి మాయిచ్చారైజర్ రాయడం మంచి పద్దతి అనే చెప్పాలి.
5 . నీళ్లు ఎక్కువ తీసుకోండి
వేసవిలో ఎన్ని మంచి నీళ్లు తాగితే అంత మంచిది .మంచి నీళ్ళు ఎక్కువగా తాగడం వలన ఆరోగ్యమే కాదు, చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. దీనితో శరీరం లోని మలినాలు బయటకు వెళ్ళడానికి మార్గం సుమమవుతుంది. డి హైడ్రేషన్ అవకుండా చూసుకోవడం వలన చర్మం పొడి బారకుండ కూడా ఉంటుంది.
For
More Health News and Health Tips Visit saycinema.blogspot.in.