స్వచ్ భారత్ పేరుతో మన భారత ప్రాధానమంత్రి నరేంద్ర మోడి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "స్వచ్ భారత్" కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే తాజాగా అత్యంత స్వచ్ఛతా ప్రమాణాలు పాటిస్తున్న రైల్వేస్టేషన్ల జాబితాను భారత రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇవాళ విడుదల చేశారు. ఏ 1 కేటగిరిలో విశాఖపట్నం , సికింద్రాబాద్, జమ్ముతావి రైల్వే స్టేషన్లకు చోటు దక్కగా , ఏ కేటగిరిలో బియాస్, ఖమ్మం, అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్లు చోటు దక్కించుకున్నాయి.
అలాగే జోనల్ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వేకు తొలిస్ధానం దక్కగా, రెండో మూడు స్థానాల్లో ఈస్ట్‌కోస్, మధ్య రైల్వే జోన్లు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫాంలే కాకుండా ఇకపై రైళ్లకు కూడా ర్యాంకింగులు ఇవ్వబోతున్నట్లు సురేష్ ప్రభు ప్రకటించారు. పోర్టల్ ద్వారా యాత్రికులు తమ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని ఆయన తెలిపారు.దేశవ్యాప్తంగా మొత్తం 407 రైల్వే స్టేషన్లలో ఐఆర్సీటీసీ, క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడివిడిగా ఈ సర్వే నిర్వహించాయి.