మనం రోజు యోగులు, సన్యసులను చాలా మందిని చూస్తూ ఉంటాం. వారందరూ
హిందూ మతానికి చెందేన వారు. కానీ మన్నలో చాలా మందికి కొని సందేహాలు ఉన్నాయి అవి ఏంటి
అంటే ఎనో రంగులు ఉండగా హిందూ మతానికి చెందిన యోగులు, సన్యాసులూ కాషాయం రంగునే ఎందుకు
వేసుకుంటారు? కాషాయం రంగు హిందూ మతాన్ని మాత్రమే సూచిస్తుందా? అని.
మన శాస్త్రాల ప్రకారం కాషాయం రంగు సూర్య తేజానికి, జ్ఞానానికీ,
చైతన్యానికీ గుర్తు. నిర్వీర్యంగా, నిస్సత్తువగా ఉన్న దేశాని మేల్కొల్పడానికి జ్ఞాన
సూర్యులై ప్రకాశిస్తూ ఉంటారు ఋషులు. అలాగే అందారని సమానంగా చూడాలి అనే సూత్రని సూచిస్తూ
ఉంటుంది. అందుకే ఋషులు, యోగులు సన్యాసులు కషాయాన్ని వేసుకుంటారు.
కాషాయం అగ్నికి ప్రతీక.
మానవులలో అహాన్నీ, కామ క్రోధాది అరిషడ్వర్గాలనీ పూర్తిగా నాశనం చేస్తుంది. కాషాయం వేసిన
వారు కుల, మత, పేద, ధనిక అనే భేదాలనూ, జ్ఞానమనే ఒక అస్త్రంతో నాశనం చేస్తారు. కనుకనే
యోగులు సన్యాసులు కాషాయం గల వస్త్రాలను ధరిస్తారు.
- For More Interesting News and Facts Please Visit saycinema.blogspot.in.