కాఫీ మనలో చాలా మంది ఉదయం, సాయంత్రం, రాత్రి తాగుతూ ఉంటాం. కాఫీయే కదా తాగితే ఆరోగ్యానికి హాని జరగదు అని అనుకుంటాం కానీ ఊబకాయం వస్తుంది అని డాక్టర్స్ అంటున్నారు.
కాఫీతో లాభాలు ఉన్నాయి అలాగే అనర్ధాలు ఉన్నాయి. అతిగా కాఫీ తాగటం వల్ల శరీరం బరువు పెరుగుతుంది. అలాగే కొన్ని రకాలైన మొండి వ్యాధులు కూడా వస్తాయి అని పరిశోధకులు తెలిపారు.
కొందరు కెఫీన్ రహితమైన కాఫీ తీసుకుంటున్నాం అని అనుకుంటారు అలాంటి వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు 5 సార్లు కాఫీని తీసుకునే ఆరి ఉదరభాగంలో కొవ్వు ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ (సీజీఏ) కి షూగర్ నివారించే గుణాలు ఉన్నాయి, కానీ మోతాదు మించితే కొవ్వు పేరుకునే సమస్య వస్తుంది. కాబట్టి కాఫీ అతిగా సేవించకండి.
For More
Health Tips and Health News Please Visit Say Cinema.