వేసవి కాలంలో అందరు
ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి.
లేదంటే ఎండలో ఉన్నపుడు వడదెబ్బ
తగులుతుంది. బయటకు అడుగు పెట్టేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వెంట టేసుకువెళ్ళాలి.
టైమ్ కి తగిన ఆహారం తినాలి. ఇప్పుడు వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో చూద్దాం.
1. ఉల్లిపాయను నూరి
శరీరానికి రాయాలి.
2. వేయించి ఉన్న
జీలకర్రను పొడిచేసి అరస్పూన్ ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని
స్వీకరించాలి.
3. ఎండలో నుండి రాగానే
చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్ను రాసుకొని పడుకోవాలి.
4. మజ్జిగ ఎక్కువగా
తీసుకోవాలి.
5. కీరదోస ముక్కల్ని
స్వీకరించడంవల్ల డీహైడ్రేషన్ రాదు.
6. పుచ్చకాయ,
కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
7. అలాగే సలాడ్స్, తాజా
కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు స్వీకరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
For More
Health News and Health Tips Please Visit Say Cinema.