పోర్టబుల్ ఏసీ వచ్చేసింది


సూర్యుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 11 గంటలు దాటిందంటే అడుగు బయట పెట్టాలేని పరిస్థితి. పోనీ ఇంట్లో ఉందామంటే ఉక్కపోత. ఫ్యాన్ స్పీడ్తిగా రుగుతున్నా చెమటలు దరపతంగా కారిపోతున్నాయి. ఏసీ అంటే మధ్యతరగతి ప్రజలు పెట్టుకోలేని పరిస్థితి. ఒకవేళ పెట్టుకున్నా వేళల్లో కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి. మరోపక్క ఏసీ ఎక్కడ ఉంటే మనం అక్కడి కి వెళ్లి కూర్చోవాలి.. కూలర్ లా ఏసీని ఎటుపడితే అటు ఎక్కడికిపడితే అక్కడికి మార్చటం అసలు కుదరదు. ఈ నేపథ్యంలో రష్యా దేశానికీ చెందిన ఓ వ్యక్తి పోర్టబుల్ ఏసీని తయారు చేశాడు.

దానికి ఎవాపొలార్ అని నామకరణం చేసాడు. దీన్ని ఎక్కడికంటే.. అక్కడికి తీసుకెళ్లొచ్చు, ఎటుపడితే అటు తిప్పచు. సాధారణ ఏసీల్లా కాకుండా ఓ ప్రత్యేకమైన ఫిల్టర్, రీ ఫిల్లబుల్ కంటెయినర్‌లో ఉండే ద్రవం ద్వారా ఈ ఏసీ గాలిలోని వేడిని చల్లబరుస్తుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ ఏసీ. దాదాపు ఇద్దరికి సరిపోయేంత చల్లదనాన్ని ఇవ్వగలుగుతుంది ఎవాపొలార్. దీని ధర సుమారు 11 వేల రూపాయలు. ఇందులోని రీఫిలబుల్ కంటెయినర్‌ సరిగా పనిచేయకపోతే మరో 1300 చెల్లించాల్సిందే సుమ!

Share this

Related Posts

Previous
Next Post »