సాధారణంగా ఈరోజుల్లో ఒక మంచి స్మార్టు ఫోన్ కొనాలంటే కనీసం 8 నుండి 10 వేలు ఖర్చు పెట్టాల్సిందే. మనకు నచ్చిన ఫీచర్లతో తక్కువ ధరలో మంచి నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమీ సంస్థ తాజాగా కేవలం ఒక్క రూపాయికే మొబైల్ ఇస్తానంటోంది. షియోమీ సంస్థ భారత మొబైల్ మార్కెట్ లోకి అడుగుపెట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కళ్ళు చెదిరే ఆఫర్ అనౌన్సు చేసింది.
ఈ నెల అంటే జులై 20 నుంచి 23 వరకు వర్తించే ఈ ఆఫర్ పై భారతీయ ప్రజలు అప్పుడే ఆసక్తి పెంచుకున్నారు. 20 నుంచి 23 తేదీల లో ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లాష్ సేల్ పేరిట ఫేస్ బుక్ ద్వారా షియోమీ ఈ భారీ ఆఫర్ను అందించనుంది. ఈ బంపెర్ ఆఫర్ లో భాగంగా తొలిరోజు 10 షియోమీ ఎంఐ ఫోన్లు ఐదు -100 పవర్ బ్యాంకులు - రెండో రోజు రెడ్ మీ నోట్ 3 ఫోన్లు పది - 100 ఎంఐ బ్యాండ్ లు - ఆఖరి రోజున ఎంఐ మ్యాక్స్ ఫోన్లు పది - 100 ఎంఐ బ్లూటూత్ స్పీకర్లను వినియోగదారులకు అందజేయనుంది.
ఇందుకోసం ఏం చేయాలో కూడా షియోమీ సంస్థ ఇప్పటికే పలు సూచనలు ప్రకటించింది. ఫేస్ బుక్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దీనికోసం వినియోగదారులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 19 లోగా పేస్ బుక్ లో రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు ఉంచుతామని షియోమీ వెల్లడించింది. ఎలా చేయడం ద్వారా తన వ్యాపారం మరింత విస్తరించుకునేందుకు షియోమీ సంస్థ ప్లాన్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే షియోమీ ఫేస్ బుక్ పేజీలోకి వెళ్లి రిజిస్టర్ అయ్యిపోండి.
For More
Movie News And Tollywood Updates Please Visit saycinema.blogspot.in