ప్రస్తుత కాలంలో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలో అధిక శాతం మంది ఊబకాయంతోనో లేక అధిక బరువుతోనో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి గల కారణాలు మాట ఎలా ఉన్నా బరువు పెరిగిన వారు ఆ బరువును తగ్గించేందుకు నానా తినడం తిప్పలు మానేసి, జిమ్ ల చుట్టును తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. అయితే నిపుణులు మాత్రం నీరు తాగి బరువు తగ్గవచ్చని అంటున్నారు. నీటిని తాగితే కేవలం 10 రోజుల్లోనే 5 కిలోల బరువు తగ్గుతారట. నీటిని రోజూ తాగుతూ, సరైన వేళకు భోజనం చేస్తూ, వ్యాయామం చేస్తుంటే అతి తక్కువ వ్యవధిలోనే సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
టీ, కాఫీ ముందు
టీ, కాఫీ ముందు
టీ, కాఫీ వంటివి తాగే ముందు ఒక గ్లాస్ నీటిని తాగియితే కడుపులో ఏర్పడే అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడమే కాదు, అధిక బరువును కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
భోజనానికి ముందు
భోజనానికి ముందు ఒక ఫుల్ గ్లాస్ నీటిని తాగాలట. ఇలా చెయ్యడం వల్ల, ఆకలి తగ్గుతుంది. దాంతో కడుపు నిండిన భావన కలిగి భోజనం కూడా తక్కువగా తింటాం. దీంతో ఆటోమేటిక్ గా బరువు తగ్గుతారు.
పడుకోడానికి ముందు
మనం రాత్రి పడుకోడానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగడం వల్ల అర్థరాత్రి సమయంలో కలిగే ఆకలిని నియంత్రిస్తుందట.
సోడా, జ్యూస్ బదులుగా
దాహం వేసినప్పుడు సోడా, జ్యూస్ బదులుగా ఒక్క గ్లాస్ నీటిని తాగితే అదనపు షుగర్స్ చేరవు. బరువు కూడా తగ్గుతారు.