భారత డ్రైవింగ్ లైసెన్స్ తో ఈ దేశాలలో కూడా డ్రైవింగ్ చెయ్యచ్చు



ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక విధమైన నియమ నిభందనలు ఉంటాయి . మన దేశంలో వాహనం నడిపే ప్రతి ఒక్కరి వద్ద భారత రవాణా శాఖ వారు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలి. ఇండియా జారీ చేసే లైసెన్సుతో కేవలం భారత్లోనే కాక ఇంకా కొన్ని దేశాలలో కుడా హాయిగా డ్రైవింగ్ చెయ్యవచ్చు . భారత ప్రభుత్వం జారి చేసే డ్రైవింగ్ లైసన్స్తో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 14 దేశాలలో డ్రైవింగ్ చేయడానికి అనుమతులు ఉన్నాయి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఉన్న 14 దేశాల ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఫిన్లాండ్:
యూరప్ దేశాలలో ఒకటైన ఫిన్లాండ్లో భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్లైసెన్స్ద్వారా అక్కడ ఎటువంట ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు.

2. నార్వే:
ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశం నార్వే.నార్వే యూరప్ఖండం లోనే ముఖ్య పర్యాటక దేశంగా ఉంది. ఇందులో మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో వాహనాలను నడపవచ్చు.

3. స్పెయిన్:
యూరప్ఖండంలోనే ఉన్న మరొక దేశం స్పెయిన్. స్పెయిన్ దేశం కు ప్రపంచ వ్యాప్తం గా ఒక మంచి గుర్తింపు ఉంది . స్పెయిన్ లో భారత దేశం జారి చేసే డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనాలను డ్రైవ్ చేయవచ్చు. స్పెయిన్ లో ఉన్న బార్సిలోనా మరియు మాడ్రిడ్ నగరాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

4. కెనడా:
అమెరికా ఉన్న అతి విశాలమైన దేశంగా కెనడా పేరొందింది .కెనడా లోని రవాణా శాఖ వారి రూల్స్ , భారత రవాణా శాఖ వారి రూల్స్ రెండు దాదాపు ఒకేలా ఉంటాయి . ప్రపంచంలో అతి పెద్ద జలపాతం నయగారా జలపాతం కెనడాలోనే ఉంది.

 5.ఇటలీ:
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఇటలీ దేశంలో కుడా మన లైసెన్స్ తో ఎటువంటి అడ్డు లేకుండా డ్రైవింగ్ చెయ్యవచ్చు .

6.మారిషస్:

మడగాస్కర్ దేశానికి తూర్పున ఉన్న రెండు అందమైన ద్వీపాలు ఉన్నాయి వాటినే మారిషస్ అంటారు. పర్యాటకులకు దేశం ప్రత్యేకం . ఏడాది పొడవునా దేశంలో మీరు మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో డ్రైవింగ్ చేయవచ్చు.

7. దక్షిణాఫ్రికా:

డ్రైవింగ్ లైసెన్స్ భారత ప్రాంతీయ భాషలో కాకుండా ఇంగ్లీష్ లో ఉన్నట్లయితే ఎటువంటి అడ్డు లేకుండా సౌత్ ఆఫ్రికాలో వాహనాలను నడపవచ్చు.

8. న్యూజిలాండ్:
అడ్వెంచర్లు చెయ్యాలనుకునే వారికి ప్రత్యేకమైన దేశం న్యూజిలాండ్ . మీ లైసెన్స్‌‌లో మీరు ఏయే వాహనాలను నడపవచ్చు అని స్థానికి రవాణా కార్యాలయాధికారులు పొందుపరిచిన వివరాల ప్రకారం ఆయా వాహనాలను మాత్రమే ఇక్కడ నడపాల్సి ఉంటుంది.

9. స్విట్జర్లాండ్:
అందమైన ప్రదేశాలు మరియు కంటికి ఇంపుగా ఉండే ప్రకృతి రమణీయ ప్రదేశాలకు నిలయం స్విట్జర్లాండ్. ఇందులో భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్లకు అనుమతి కలదు.

10. ఆస్ట్రేలియా:
దేశీయంగా ప్రభుత్వం జారీ చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఉన్నచో, మీరు ఆస్ట్రేలియాలో డ్రైవ్ చేయవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి జారీ చేసిన లైసెన్స్ ఆంగ్లంలో ఉండాలి.

11. ఫ్రాన్స్ :
ఫ్రాన్స్ దేశ వ్యాప్తంగా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో చక్కర్లు కొట్టవచ్చు. కాని మీ లైసెన్స్ ఇంగ్లీషు నుండి ఫ్రాన్స్భాషలోకి మార్పిడి చేయించుకోవాలి.

12. అమెరికా (యుఎస్):
 భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్తో ఏడాది పాటు ఎటువంటి నిబంధనలు లేకుండా డ్రైవ్ చేయవచ్చు. అయితే దీనితో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వారి ప్రాంతీయ భాషలో తప్పకుండా ఉండాలి.
13.ఇంగ్లాండ్ :
ఇంగ్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా ఉన్న దేశాలలో మన భారత ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్తో ఏడాది పాటు ఎటువంటి అనుమతులు లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు.

14. జర్మనీ :
ఎక్కువ మంది ఇండియా నుండి జర్మనీకి పయనమవుతుంటారు అలాంటి వారి వద్ద భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే జర్మనీలో ఆరు నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు. మీ లైసెన్స్ ప్రాంతీయ భాషలో ఉంటే దానిని ఆంగ్లంలోకి మార్పిడి చేయించుకోవాలి.

Share this

Related Posts

Previous
Next Post »