అవును మీరు చదివింది నిజమే మన దేశంలో ఉన్న ఒక గ్రామంలో మగాళ్లకు ఎంట్రీ లేదు. నమ్మసక్యంగా లేకున్నా ఇది నిజం. ఆ గ్రామం మొత్తం పచ్చదనంతో, ఎత్తైన కొండలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో దేవుడే ఈ గ్రామాన్ని నిర్మించాడా అన్నట్లు ఉంటుంది. ఈ కొండలు, గుహలు ఇవన్నీ ఈ వింత కసోల్ గ్రామానికి ఉన్న ప్రధానాకర్షణ. కేవలం అంతేకాకుండా ఈ గ్రామంలో ముఖ్యంగా మగాళ్లకు నో ఎంట్రీ లేదు. ఇంతకీ మగాళ్లకు ప్రవేశమ లేని ఈ గ్రామం మన దేశంలో ఎక్కడుంది అనుకుంటున్నారా.!
ఆ గ్రామం హిమాచల్‌ప్రదేశ్ లో ఉంది. ఈ గ్రామం ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఇక్కడికి ఇజ్రాయిల్ దేశం నుండి మహిళలు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళు ఆ గ్రామాన్ని అంతగా ఇష్టపడానికి గల ప్రధాన కారణం ఆ గ్రామం ప్రకృతి సౌందర్యం, పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకవేళ ఎవరైనా వెళ్ళినా అందాలు ఆస్వాదించే రావడమే తప్ప, ఒక్క నైట్ ఉండేందుకు కూడా నో ఛాన్స్. ఒకవిధంగా చెప్పాలంటే పురుషులపై ఈ గ్రామంలో నిషేధం. ఇందుకు కారణాలు లేకపోలేదు. విదేశీ మహిళలను ఈవ్ టీజింగ్ చేయడమే మగాళ్లను నిషేధిచడానికి గల ప్రధాన కారణమని అక్కడి స్థానికుల చెబుతుంటారు. మొత్తానికి కసోల్ గారామంలో పుట్టిన మగాళ్ళు మాత్రమే అక్కడి అందాలను ఆస్వాదించగలరన్నమాట....