మనకి దాహమేస్తే నీళ్ళు తాగేస్తాం. ఇది మంచిది కూడా. అదే బయట దాహమేస్తే కూల్ డ్రింక్ తాగుతుంటాం ఎక్కువగా, ఏది మంచి అలవాటు సుమా. దాహాంగా ఉంటే కొబ్బరినీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది. మరి కొబ్బరినీళ్ళు వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
* కొబ్బరినీళ్ళలో కాల్షియం, ఫాస్ ఫరస్, సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం లాంటి ఎలెక్ట్రోలైట్స్ ఉంటయ్, అవి మేలు చేస్తాయ్ కూడా మనకి. కానీ కూల్ డ్రింక్ ఎక్కువగా తాగితే ప్రమాదం.
* ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కొబ్బరినీళ్ళు తాగించటం కూడా ఉండేది. ఎందుకంటే ఇది రిహైడ్రేషన్ కి పనికివస్తుంది.
* హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడేవారు కొబ్బరినీళ్ళు తాగే ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉన్న ఎలక్ట్రోలైట్స్ బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి.
* ఆటలు బాగా అడేవాళ్ళు, శారీరక కష్టం చేసేవాళ్ళు ఎనర్జీ డ్రింక్స్ బదులు గా కొబ్బరినీళ్ళు తాగితే బాగుంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఎనర్జీ డ్రింక్స్ లో పొటాషియం తక్కువ, షుగర్స్ ఎక్కువ ఉంటయ్.
* ఫైబర్ జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. కోకనట్లో ఫైనర్ బాగా లభిస్తుంది..
* మద్యం బాగా సేవించేవారు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది.
* మైన్ గా మెటిమలకు, ఇతర చర్మ సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు ఉపయోగపడతాయి.
* కొబ్బరినీళ్ళు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది.
For More Health
News And Health Tips Please Visit saycinema.blogspot.in