అలా అయితే నా అభిమానులుగా ఉండొద్దు: ఎన్టీఆర్



తన అభిమానులెవరూ హద్దులు దాటుతారని తాను అనుకోవడం లేదు అని, హద్దులు దాటే ప్రేమ్, అభిమానం తన మీద చూపించదు అని స్పష్టం చేశాడు నటుడు ఎన్టీఆర్. మొదట దేశం.. రెండు కన్నవాళ్లు.. తర్వాత భార్యా పిల్లలు.. ఆ తర్వాత శ్రేయోభిలాషులు, చివరగా అభిమాన నటుడి అని గుర్తు చేశాడు యంగ్ టైగర్. ఇటీవల జరిగిన అభిమానుల మధ్య గొడవలో వినోద్ రాయల్ అనే పేరు గల పవర్ స్టార్ ఫ్యాన్ హత్యకు గురైన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పాడు యంగ్ టైగర్.

తాను అందరు హీరోల అభిమానులకూ చెప్పేదొకటే అంటూ మొదలు పేటీనా ఎన్టీఆర్. మా హీరోల మధ్య గొడవలు ఉన్నాయ? చెప్పండి. మరి ఎందుకుకి ప్రాణాలు తీసుకునే గొడవలు. అభిమానం, ప్రేమ చిత్రం వరకే ఉంచండి. నా అభిమానులెవరూ ఇలా ప్రవర్తిస్తారని అనుకోను అని చెప్పాడు. అలా ప్రవర్తించేవాళ్లు తన అభిమానులుగా అసలు ఉండొద్దు అని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.

Jr. NTR Reaction On Pawan Kalyan Fan Murder Issue


For More Movie News And Tollywood Updates Please Visit saycinema.blogspot.in

Share this

Related Posts

Previous
Next Post »