తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోండిలా.....


ఆధునిక కాలం లో చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని ఏజ్ ల వారిని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య తెల్లజుట్టు. వాతావరణ కాలుష్యం వలన, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, వత్తిడి,అశ్రద్ధ ఇలా అనేక కారణాల వల్ల  చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వేధిస్తుంది. అయితే ఈ సమస్యకి మార్కెట్ లో అనేక ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. చాలా మంది వీటినే ఆశ్రయిస్తారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం అయితే మాత్రం కాదు. వీటివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అయితే ఈ సమస్య నుండి బయటపడేందుకు ఆయుర్వేదం లో ఒక చిట్కా ఉంది దీనిని క్రమం తప్పకుండా వాడడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గించుకోవచ్చు. ఎక్కువ డబ్బు ఖర్చు కాదు అలాగే అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.అదే విధం గా  జుట్టు రాలడం, తెల్లజుట్టు తెల్లబడడం తగ్గుతుంది. దీన్ని  వేలాది  మంది పై ప్రయోగించి విజయం సాధించిన చరిత్ర కూడా ఉంది. పలు కేసుల్లో 70 సంవత్సరాల  వయసు కలిగిన వారికి జుట్టు నల్ల బడింది అని నిరూపించారు. అప్పటినుండి దీని ఆయుర్వేదం  లో భాగం చేశారు. మన ప్రాచీన ఆయుర్వేదం లో తెల్లజుట్టును  నల్లబరిచే ఈపద్దతి ని ఇప్పుడు తెలుసుకుందాం . దీనికి కావలసిన పదార్ధాలు అన్ని ఇంట్లో దొరికేవి కాదు కొన్ని ఆయుర్వేద షాప్ లో కొనుగోలు చేసుకోవాలి.

కావలసినవి :

మెత్తగా రుబ్బిన గోరింటాకు- 100 గ్రాములు
కాఫీ పొడి-3 గ్రాములు
పెరుగు -25 గ్రాములు
నిమ్మరసం- 4 స్పూన్స్
ఖదిరము (కటేచు)- 3 గ్రాములు
బ్రహ్మీ చూర్ణం - 10 గ్రాములు
ఉసిరి చూర్ణం - 10 గ్రాములు
పద్దతి:

 వీటన్నిటిని  బాగా కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాల తరువాత నీటితో శుభ్రం గా కడగాలి. ఇలా 15 రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అని ఆయుర్వేద శాస్త్రం లో చెప్పబడింది.

Share this

Related Posts

Previous
Next Post »