మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ఎం చెయ్యాలో తెలుసా.!


మేని మెరుపుని పోగొట్టే సమస్యలు నిత్యం ఎన్నో వస్తుంటాయి అయితే వాటిని ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో ఎలా నివారించుకోవాలో చూద్దాం.

బ్లాక్ హెడ్స్


బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గాలంటే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి రాసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రపరచాలి.

పొడి చర్మం

పొడి చర్మం బాధిస్తుంటే ఓట్స్ ను నానపెట్టి మెత్తగా రుబ్బి, శరీరానికి పట్టించి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

కమిలిన చర్మానికి

ఎండకు కమిలిన చర్మం నుండి ఉపశమనం పొందాలంటే పాలలో దూది ఉండ ముంచి కమిలిన చోట రాయాలి. ఆరాక చల్లని నీటితో శుభ్రపరచాలి.

పసుపు రంగు గోర్లు

గోర్లు పసుపు రంగు లో ఉన్నవారు తెల్లగా మారాలంటే బేకింగ్ సోడా రాసి, మృదువుగా రుద్దాలి.

మొటిమలు

యాక్నే, మొటిమలు తగ్గాలంటే కాఫీ పొడి, కొబ్బరి నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్ర పరుచుకోవాలి.

Share this

Related Posts

Previous
Next Post »