నోకియా 3310 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.!


గతంలో సంచలనం సృష్టించిన నోకియా 3310 ఫోన్ ను రీమోడల్ చేసి విడుదల చేస్తామని సదరు కంపెనీ ప్రకటించినప్పటి నుండి నోకియా 3310 ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న ఐకానిక్‌ ఫీచర్‌ ఫోన్‌ నోకియా 3310(2017) ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రఖ్యాత నోకియా బ్రాండ్‌ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తీసుకొచ్చిన ఫీచర్ ఫోన్‌ను నేడు అధికారికంగా విడుదల చేశారు. మే 18 గురువారం నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే 3310 మోడల్‌ పేరునే ఈ ఫోన్‌ ధరగా నిర్ణయించింది సదరు సంస్థ. దీని ధర రూ. 3,310గా ప్రకటించింది. ఎరుపు, పసుపు, నీలం, వూదా వంటి రంగుల్లో ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ ఫోన్లను లభ్యం కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది.

ఒకప్పుడు బేసిక్‌ ఫోన్లతో ఒకప్పుడు మొబైల్‌ మార్కెట్‌ను శాసించిన నోకియా ఆ తర్వాత ఆండ్రాయిడ్‌ ఫోన్ల దెబ్బకు చతికిలపడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ బ్రాండ్‌ పేరును ఇటీవల హెచ్‌ఎండీ గ్లోబల్‌ సొంతం చేసుకుని, సరికొత్త ఫోన్లను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌కు దీటుగా ఫీచర్లను జోడిస్తూ.. మొబైల్‌ మోడళ్లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నుంచి తొలి ఫోన్‌ అయిన నోకియా 3310 2017 వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పాత 3310 మోడల్‌కు సరికొత్త ఫీచర్లు కల్పించి ఈ ఫోన్‌ను రూపొందించింది. దీంతో పాటు నోకియా 6, నోకియా 5, నోకియా 3 మోడళ్లను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

నోకియా 3310 ఫీచర్లు ఇలా ఉన్నాయి.!
- 2.40 అంగుళాల సాధారణ డిస్‌ప్లే
- నోకియా సిరీస్‌ 30 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
- 16 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
-  మెమొరీ కార్డుతో 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం
- 2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
- 1200 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Share this

Related Posts

Previous
Next Post »