ప్రస్తుత యాంత్రిక జీవితంలో తిండి టైం కి తినకపోవడమో లేక ఆహారపు అలవాట్ల వలనో అనేక మంది వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు అత్యధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ లో రాళ్లు. కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి తట్టుకోవటం చాలకష్టం, ఎందుకంటే మన శరీరంలోని విసర్జక మండలంలో కిడ్నీలది ముఖ్య పాత్ర. కిడ్నీ లు మన శరీరానికి అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పంపిస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణమవుతాయి. మన ఇంట్లోనే లభించే పదార్థాలతోనే సులభంగా కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం........
1). అరకప్పు నిమ్మరసంను రెండు కప్పుల చల్లటి నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం ఓ కప్పు నిమ్మరసం ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ తో రాళ్లు కరగటం ప్రారంభమవుతుంది. కొద్ది రోజులకు రాళ్లు పడిపోతాయి.
2). యాంటిసెప్టిక్ గా పని చేసే పసుపును, బెల్లాన్ని కలిపి వరిపొట్టుకాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్ల రేణువులు బయటకి వచేస్తాయట.
3). కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో పాటు కొద్దిరోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి.
4). దోసగింజలను, కొబ్బరిపువ్వునూ పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు, చిన్నచిన్న రేణువులు పడిపోతాయి.
5 ). కరక్కాయల గింజలను నూరి చిక్కని పాలలో కలిపి వాటిని బాగా మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు, రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది.