పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.!


మనలో చాలా మందికి రోజూ పెరుగన్నం తినే అలవాటు ఉంటుంది. చాలామంది డాక్టర్లు కూడా పెరుగన్నం తినడం వలన మన శరీరంలోని వేడి తగ్గించుకోవచ్చు అని చెబుతారు, కానీ కొందరు మాత్రం బాబోయ్ పెరుగా అంటూ అమడు దూరం పరిగెడుతుంటారు. ముఖ్యంగా అలాంటి వాళ్ళకోసమే ఒక అద్భుతమైన ఆరోగ్య చిట్కాను అందిస్తున్నాం.

సాధారణంగా ఆరెంజ్ లో మన శరీరానికి తగినంత సి- విటమిన్ లభిస్తుంది. ఆరెంజ్ లో లభ్యమయ్యే సి-విటమిన్ మనలోని వ్యాధి నిరోధక శక్తి ని కూడా అద్భుతంగా పెంచడమే కాకుండా  కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటుగా, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. పెరుగులో తేనె కలుపుకుని తీసుకోవడం వలన అల్సర్‌కు వంటి ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. శరీరానికి ఏర్పడే ఇన్ఫెక్షన్లను సైతం దూరం చేస్తుంది.

అధిక బరువుతో బాధపడుతున్న వారు కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినడం ద్వారా శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. తద్వారా మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తిన్నట్లయితే  నోటి పూత, దంతాల నొప్పి, వంటి ఇతర దంత సంబంధ  సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this

Related Posts

Previous
Next Post »