బ్రేకింగ్ న్యూస్ : వాయిదా పడ్డ పెట్రోల్‌ బంకులు ఆందోళన


భారత దేశవ్యాప్తంగా అన్ని పెట్రోలు బంక్‌ ల యాజమాన్యాలు ఈ ఆదివారం(14  మే 2017 ) నుంచి చేపట్ట దలచిన తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ప్రతి ఆదివారం వారాంతపు సెలవు తీసుకుంటామని అలాగే సోమవారం నుంచి ఒక షిఫ్టులో(ఉందయం 6 నుండి సాయంత్రం 6 ) మాత్రమే  పనిచేస్తామని ఎనిమిది రాష్ట్రాలకు చెందిన పెట్రోలు బంక్‌ల యజమానులు గతం లో ఒక ప్రకటనలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆదివారం నుంచి ప్రారంభించనున్న తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నామని, పెట్రోలు బంక్‌లు యథావిథిగా పనిచేస్తాయని శనివారం వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించడానికి పిలుపునిచ్చిన దృష్టా తమ ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ మహారాష్ట్ర పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఉదరు లోధా తెలిపారు. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరి చర్చలు సఫలమవుతాయో లేక విఫలమవుతాయో ఇంకా తెలియాల్సి వేచి చూద్దాం.

Share this

Related Posts

Previous
Next Post »