దేశీయ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ ఒక సరికొత్త ఆఫర్ తో పాటు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2(2017) పేరిట ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది . భారత్ లో ఇంటర్నెట్  వాడకం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తమ ఫోన్ కొంటే ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ అందిస్తామంటూ మైక్రోమ్యాక్స్ ప్రకటిం చడంతో స్మార్ట్‌ఫోన్ అభిమానులంతా ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అని ఆసక్తి కనబరిచారు. అద్భుతమైన ఆఫర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలకు సిద్ధమైంది. భారత్‌లోని అన్ని రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్ విక్రయించనున్నట్టు మైక్రోమ్యాక్స్ చెబుతోంది. ఉచిత ఇంటర్నెట్‌తో పాటు ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్‌ను కూడా ఫ్రీ అందించనున్నట్టు మైక్రోమ్యాక్స్ సంస్థ ప్రకటించింది. ఎయిర్‌టెల్ 4జీ సిమ్ కార్డు ప్రీలోడెడ్‌తో ఇది మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్ ధర 11,999 రూపాయలు. ఈ ధరలో కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5ను ఆఫర్ చేయడం ఈ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణ. ఏడాదిలో స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా  మైక్రోమ్యాక్స్ ఆఫర్ చేస్తుండడం మరో విశేషం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే  కాన్వాస్ 2 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్‌తో రన్ అవుతుంది. 5 అంగుళాల డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, ఆటో ఫోకస్, 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 64జీబీ వరకు ఎక్స్ పాండబుల్  మెమరీ, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వినియోగదార్లను ఆకర్షిస్తోంది.
ఇంటర్నెట్ యూజర్లకు మైక్రోమాక్స్ బంపర్ ఆఫర్...ఛాన్స్ మిస్ చేసుకోకండి...
10:15:00
  latest news updates
  Micromax Canvas 2(2017)
  Micromax Free Internet
  Micromax Phones
  news
  News Updates
  Say CInema
  Tech News
 

