వేసవిలో చల్ల చల్లని మ్యాంగో లస్సీ చేసుకోండిలా..!


వేసవి వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి బయటకి రావడానికి అస్సలు ఇష్టపడరు. ఆ విషయం అలా పక్కన పెడితే వేసవిలో దొరికే మామిడి పళ్ళ కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటారు. అయితే వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి పళ్లతో ఇంట్లోనే రుచికరమైన మ్యాంగో లస్సీ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం...

మ్యాంగో లస్సీ కి కావలసిన పదార్దాలు:      
*వెన్నతీసిన పెరుగు-1కప్పు
*మామిడి రసం-3/4 కప్పు
*పంచదార-2 టేబుల్‌ స్పూన్లు
*యాలకుల పొడి-1 టీ స్పూన్‌
*ఐస్‌ ముక్కలు -సరిపడా
తయారుచేసే విధానం:

ముందుగా మామిడి పండుని తీసుకుని దాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో మామిడి పండ్ల రసాన్నితీసి పక్కన పెట్టుకోవాలి.ఆ తరువాత మిక్సీ జార్‌లో పెరుగు, పంచదార వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మామిడి రసాన్ని కూడా వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పొడవాటి జార్‌లోకి తీసుకుని కాస్త చల్లని నీరుని పోసి బాగా కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి, ఐస్‌ ముక్కలు వేసి మరోసారి కలపాలి. చల్ల చల్లని మ్యాంగో లస్సీని సర్వింగ్‌ గ్లాసుల్లో పోసి కొద్దిగా యాలకుల పొడితో గార్నిష్‌ చేసి కాస్త ఐస్ క్రీం కూడా వేసుకుని మండు వేసవిలో చల్లని మ్యాంగో లస్సీ ని ఇంటిల్లిపాది ఆస్వాదించండి.

Share this

Related Posts

Previous
Next Post »