ఉదయం తినవలసిన టిఫీన్స్ ను మధ్యాహ్నం, తీసుకుంటారు కొందరు.
కానీ, ఆరోగ్య పరంగా ఇది మంచిది కాదని డాక్టర్స్ పేర్కొంటున్నారు. బ్రేక్
ఫాస్ట్ తీసుకోకుండా అసలు ఉండదు. బ్రేక్ ఫాస్ట్ తినని వారికి గుండె జబ్బులు ఎక్కువ వాచే
అవకాశం ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల తెలిపారు.
మార్నింగ్ టైమ్ లో టిఫీన్స్ తినకపోతే ఆకలి బాగా వేస్తుంది.
దీంతో మధ్యాహ్నం భోజనం కాస్త ఎక్కువ తింటాం దీనివల్ల, బ్లడ్ షుగర్ పెరుగుతుంది. దీంతో
డయాబెటిస్, బ్లడ్ ప్రజర్, అధిక కొవ్వు వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
తీపి మరియు నూనె తో చేసిన పదార్థాలు ఎక్కువగా తింటే బ్లడ్
లో చక్కెర పెరిగిపోయి, మళ్లీ తగ్గిపోతుంది. దాంతో మళ్లీ ఆకలి వేస్తుంది. ఫలితంగా ఫాస్ట్
ఫుడ్ కు అలవాటు పడతాం. కాబట్టి శరీరంలో బ్లడ్ షుగర్ ఒకే రీతిలో ఉండేందుకు మార్నింగ్
ఆహారం తీసుకోవడం బెస్ట్.
సాధారణంగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు శరీరానికి కేలరీలు
ఎక్కువగా అవసరం అవుతాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఎంత తినలో అంత తీసుకోవాలి. నైట్
టైమ్ పని ఉండదు కాబట్టి డిన్నర్ స్వల్పంగా తినాలి.
For More Health
News and Health Tips Please Visit Say Cinema.